మంత్రి ఉన్నా..అభివృద్ధి లేదు..

విజయనగరంః  వైయస్‌ఆర్‌ పాలనలో లాభాల బాటలో నడిచిన జ్యూట్‌ మిల్లులు చంద్రబాబు పాలనలో మూతపడే స్థితికి వచ్చాయని బొబ్బిలి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకట చిన అప్పలనాయుడు అన్నారు.దీంతో ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పొయి రోడ్డున పడ్డారన్నారు.చెరుకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.13 కోట్లు రైతులకు బకాయిపడిందన్నారు.రెండు సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. అనేక ఉద్యమాలు చేసి మంత్రికి మొరపెట్టుకున్న ఆయనలో చలనం లేదన్నారు. రైతుల సమస్యలను కూడా పరిష్కరించలేని మంత్రి ఉన్నా ఒక్కటే..లేకపోయినా ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
 

Back to Top