కొన‌సాగుతున్న వాయిదాల ప‌ర్వం

ఢిల్లీ:  పార్ల‌మెంట్‌లో ప్ర‌తి రోజు హైడ్రామా న‌డుస్తోంది. ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ‌కు అనుమంతించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అనుమ‌తించ‌కుండా వ‌రుస‌గా ఆరు రోజుల పాటు వాయిదాలు వేస్తున్నారు. శుక్ర‌వారం స‌భ ప్రారంభం అయిన కొద్ది సేప‌టికే స్పీక‌ర్ మ‌ధ్యాహ్నానానికి వాయిదా వేశారు. స‌భ ప్రారంభం కాగానే టీఆర్ఎస్‌, అన్నా  డీఎంకే ఎంపీలు ఆందోళ‌న‌కు దిగ‌డంతో స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాలేదు. కాగా, ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాటం కొన‌సాగిస్తోంది. శుక్ర‌వారం ఉద‌యం పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్లోని ప్ర‌ధానద్వారం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటు నిన‌దించారు.
Back to Top