వైయస్ జగన్ సమక్షంలో చేరిక

హైదరాబాద్ః  ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎవరికి ఎక్కడ ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ అండగా నిలిచే ప్రజానాయకుడు వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ప్రముఖ వైద్యుడు పోలా అజయ్, మాజీ జడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావులు వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...వైయస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మహానేత వైయస్సార్  ఆశయాలు నెరవేరాలన్నా, మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్నా వైయస్ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top