ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాద‌వ్‌ అరెస్టు




నెల్లూరు:  ఇళ్ల కూల్చివేత‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టిన  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన ఘటనాస్థలిలో బైఠాయించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అనిల్‌ కుమార్‌ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళన చేపడుతున్న నేతలను అరెస్టు చేయడం అన్యాయమని స్థానికులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ పాల‌న తీరును త‌ప్పుప‌ట్టారు.  

Back to Top