నరసారావుపేటలో వైయస్ఆర్ సీపీ ప్రజా బ్యాలెట్

గుంటూరు 11 ఏప్రిల్ 2013:  విద్యుత్ చార్జీల పెంపుపై నరసారావుపేటలోని రామిరెడ్డిపేటలో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైయస్ విగ్రహం వద్ద 'ప్రజాబ్యాలెట్‌' నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో సహా పలువురు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాబ్యాలెట్ లో పాల్గొని కరెంట్ చార్జీల పెంపుపై తమ నిరసనను తెలియజేశారు.
Back to Top