నేటి షర్మిల యాత్ర 16.2కి.మీ.

మహబూబ్‌నగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం అయిజ శివారు ప్రాంతం నుంచి ప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. అయిజ దాటిన తర్వాత 5 కిలోమీటర్ల నుంచి యాత్ర ప్రారంభమై బింగిదొడ్డి, తాటికుంట్ల క్రాస్, శేషంపల్లి క్రాస్, శేషంపల్లి క్రాస్‌రోడ్, మల్దకల్, శుద్దనూనెపల్లి మీదుగా బూడిదపాడుకు చేరుకొని ఆ రాత్రికి గ్రామ సమీపంలో బస చేస్తారని పేర్కొన్నారు. సోమవారం మొత్తం 16.2 కి.మీ. నడుస్తారని వారు చెప్పారు.

Back to Top