నాలుగో రోజు షర్మిల పాదయాత్ర 16 కి.మీ.లు

హైదరాబాద్, 21 అక్టోబర్ 2012 : నాల్గవ రోజు షర్మిల పాదయాత్ర 16.2 కిలోమీటర్ల దూరం సాగనుంది. ఆదివారం పులివెందుల రింగ్‌రోడ్‌ నుండి 2.6 కి.మీలు సాగి చిన్నరంగాపురం చేరాక అక్కడి నుండి 3.8 కి.మీల దూరాన ఉన్న ఇప్పట్ల దిశగా షర్మిల తన మరో ప్రజాప్రస్థానాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇప్పట్ల నుండి 2.2 కి.మీల దూరంలోని చిన్న కుడాల క్రాస్‌కు యాత్ర చేరుతుంది. అనంతరం కిలోమీటరు దూరం ఉన్న పెద్ద కుడాల క్రాస్‌కు యాత్ర చేరుతుంది. అక్కడి నుండి లింగాల 4.6 కిలోమీటర్ల దూరం. అది పూర్తయ్యాక అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న లోపట్నూతల క్రాస్‌కు షర్మిల యాత్ర సాగుతుంది. అక్కడే నాల్గవ రోజు విశ్రాంతి.

Back to Top