ప్రేమకు ప్రతిరూపం నా తండ్రి

వైయస్సార్ జిల్లా(ఇడుపులపాయ): దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు శుక్రవారం ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా వైయస్సార్ తనయుడు, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రీతో తన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.  కొందరు భౌతికంగా మనను విడిచి వెళ్లినా ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారు. ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రిని ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రితో గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మహానేత జయంతి సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 
Back to Top