ముస్లిం సెంటర్‌లో షర్మిలకు ఘన స్వాగతం

సత్తెనపల్లి, 4 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల 81వ రోజు సోమవారం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ముస్లిం సెంటర్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు శ్రీమతి షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు. ముస్లిం సోదరులు తమ పవిత్ర గ్రంథం ఖురాన్‌ను శ్రీమతి షర్మిలకు బహూకరించారు.

అక్కడి నుంచి శ్రీమతి షర్మిల ఐదు లాంతర్ల సెంటర్ మీ‌దుగా తాలూకా సెంట‌ర్‌ వరకూ పాదయాత్ర చేస్తారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా అక్కడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహి‌స్తున్న విద్యుత్‌ మహాధర్నాలో శ్రీమతి షర్మిల పాల్గొంటారు.
Back to Top