జగన్ పై దాడి స్కెచ్ పక్కా టిడిపిదే...ఇవిగో సాక్ష్యాలు


విశాఖ విమానాశ్రయంలో జననేత జగన్ పై హత్యా యత్నం చేసిన శ్రీనివాస్ జగన్ అభిమానే అంటూ విష ప్రచారం చేస్తున్నది టిడిపి.
దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే నిందితుడు జగన్ అభిమాని అనే ముద్రవేసేందుకు ప్రణాళిక ప్రకారం ప్రచారం మొదలెట్టారు తెలుగుదేశం నాయకులు.
దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీస్ ఉన్నతాధికారి విచారణే లేకుండా దాడికి పాల్పడ్డది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనే తేల్చి చెప్పేయడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్టు అర్థం అవుతోంది.
తొమ్మిది పేజీల లేఖ అని చెబుతున్న దానిలో ఏముందో బయటపెట్టలేదు. అది నిందితుడి హాండ్ రైటింగా కాదా అనే విషయాన్ని ఇంతవరకూ నిర్థారించలేదు.
దాడి చేసిన శ్రీనివాస్ కుటుంబం అంతా టిడిపి పార్టీకి చెందిన వారే. ఈ విషయాన్ని శ్రీనివాస్ సొంత సోదరుడే ధృవీకరించాడు.
ఏడాది క్రితం జగన్ పేరుతో ఫ్లెక్సీ పెట్టినప్పుడు చుట్టుపక్కల అందరూ దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గురించి శ్రీనివాస్ అన్నయ్య చెప్పడమే దీనికి సాక్ష్యం. 
తెలుగుదేశం పార్టీ నేతలే ఆ కుటుంబానికి ఇల్లు సాంక్షన్ చేసారని అతడు స్పష్టంగా చెప్పాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే జన్మభూమి కమిటీలు వారికి పింఛన్లు, ఇళ్లు సాంక్షన్ చేసే పరిస్థితి లేదు. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారిని, ఆపార్టీని అభిమానించే వారిపట్ల తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన దారుణంగా ఉంటోంది. ప్రజా సంకల్ప యాత్రలో ఆ విషయాలను వైఎస్ జగన్ కు చాలామంది తెలియజేస్తున్నారు కూడా. జగన్ అభిమానులని తెలిసి దాడులు చేయడం, జన్మభూమి కమిటీల్లో పింఛన్లు, ఇళ్లు రాకుండా చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి సంఘటనలు కోకొల్లలు గా జరుగుతున్నాయి. అలాంటిది ఓ కుటుంబంలో జగన్ అభిమాని ఉన్నాడని తెలిసి ఆ ఊరి జన్మభూమి కమిటీలోని తెలుగుదేశం నాయకులు రుణం ఇప్పించారంటే అర్థమేమిటి? 
శ్రీనివాస్ గతంలో టిడిపి కండువా వేసుకున్న ఫొటోలు బైటపడ్డాయి. 
టిడిపి నుంచి జనసేన అభిమానిగా ఉన్నాడంటూ కొన్ని పోస్టులు కూడా నెటిజన్లు బైటపెడుతున్నారు.
ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో శ్రీనివాస్ ఏడాదిలో 9 ఫోన్లు మార్చాడని, దాదాపు 10వేల ఫోన్ కాల్స్ మాట్లాడాడని విచారణలో తేలింది. 
అంటే వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడే ఈ కుట్రకు తెరతీసారన్నమాట. 
ఏడాది క్రితమే శ్రీనివాస్ ను జగన్ అభిమానిగా ప్రచారంలోకి తెచ్చారు. ఫ్లెక్సీల ఏర్పాట్లు చేసారు. అందుకే తెలుగుదేశం నేతల చేతికి క్షణాల్లో ఏడాది కాలం నాటి ఫ్లెక్సీ ఫొటో కనీసం నలక్కుండా, చిరక్కుండా, రంగు అయినా వెలవకుండా ఫోన్లలో ప్రదర్శనకొచ్చింది. 
నిజానికి టిడిపి నేతలు చూపిన ఫ్లెక్సీ నిందితుడి ఊరిలోని ఫ్లెక్సీ ఒక్కటి కాదు అని తేలింది. అలా అయితే ఈ కొత్త ఫ్లెక్సీని సృష్టించింది ఎవరు? దాడి జరిగిన వెంటనే అది టిడిపి నాయకుడు నక్కా ఆనంద్ బాబు చేతికి ఎలా వచ్చింది?
ఇక ఎలాంటి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే శ్రీనివాస్ ఎనిమిది నెలల క్రితమే విశాఖ పోర్టు లోని టిడిపికి చెందిన నాయకుడి రెస్టారెంట్లో వెయిటర్ గా చేరాడు. 
రెండు నెలల క్రితమే సొంత ఊరికి వచ్చి ఎలాంటి సందర్భం కాకపోయినా పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. 
పెద్ద బేరం తగిలిందని లైఫ్ సెట్ అయిపోయిందని స్నేహితులతో చెప్పినట్టు సమాచారం వస్తోంది. 
అలాగే రెండు నెలల క్రితమే ఇంటి సమీపంలోని వ్యక్తి దగ్గర నుంచి కోడిపందేల్లో కోళ్లకు కట్టే కత్తిని తీసుకున్నాడని చెబుతున్నారు. 
అంటే ఇది కుట్రపూరితంగా చేసిన హత్యా యత్నమే అని క్లియర్ గా తెలుస్తోంది.
వైఎస్ జగన్ విశాఖ నుంచే ప్రతివారం ప్రయాణం అవుతారని తెలుసు కనుక ముందస్తుగా ప్లాన్ చేసుకుని మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్థం అవుతోంది. 
విశాఖ జిల్లా నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం అయినప్పటి నుంచీ ఆయన విశాఖ విమానశ్రయం నుంచి ప్రతి గురువారం హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. అన్నాళ్లుగా అక్కడే పనిచేస్తున్నప్పటికీ శ్రీనివాస్ నిన్నమాత్రమే దాడికి పాల్పడటం వెనుక రహస్యం ఏమిటి?
ఆపరేషన్ గరుడ గురించి తెలుగుదేశం ప్రచారం చేసిన తర్వాత మాత్రమే ఈ పని చేయాలనుకోవడమే కారణమా?
ఐటి సోదాల నేపథ్యంలో విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇదే సమయమని ఇలా దాడి ప్లాన్ చేసారా?
ఓ కేబినెట్ హోదా ఉన్న నాయకుడు, రెండు జాతీయ పార్టీలను ఢీకొన్న ప్రాంతీయ పార్టీ అధినేత, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజాభిమానాన్ని వెల్లువలా పొందుతున్న జగన్ పై దాడిని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తే, టిడిపి వారిని టార్గెట్ ఎందుకు చేస్తోంది? సానుభూతి మాటలపై కూడా రాజకీయం చేయడం ఏ దురుద్దేశంతో జరుగుతున్న పని అనుకోవాలి?
అంతా తాము అనుకున్న పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్న ధీమాతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ తర్వాత చంద్రబాబు కూడా దాడిని ఖండించకుండా జగన్ మీద ఎదురుదాడి చేస్తూ ఆనందిస్తున్నారా?
గత 24 గంటల్లో జరిగిన పరిణామాలన్నీ ఈవిషయాన్నే ధృవీకరిస్తున్నాయ్....పచ్చపార్టీ నేతల పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కథంతా నడిచిందని తెలుగు ప్రజలు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్ పై దాడి, దాన్ని ఆ పార్టీ అభిమాని చేసిన చర్యగా ప్రచారం, సానుభూతికోసం రచించిన డ్రామాగా చిత్రించేందుకు విపరతీతమైన ప్రయత్నం....ఇవన్నీ తెలుగుదేశం అధినేత కనుసన్నల్లో జరిగుతున్న నాటకాలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


 

తాజా వీడియోలు

Back to Top