వైయస్‌ జగన్‌ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు


వైయస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం
విశాఖ: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్రగా వస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం విశాఖ జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైయస్‌ జగన్‌ విశాఖలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన రాజన్న బిడ్డకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..విశాఖలో 13 నియోజకవర్గాల్లో ఇంచుమించు ఐదు వారాల పాటు వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశామన్నారు. ముస్లింలు, బ్రాహ్మణులు, నార్త్‌ ఇండియాన్, రైతుల ఆత్మీయ సభలు ఉంటాయన్నారు. విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి ఎక్కడ కుంటు పడిందన్న విషయాలను జననేత దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
 
Back to Top