త్రాగునీటి కోసం ఉద్యమించాల్సిన దుస్థితి

కళ్యాణదుర్గంరూరల్‌: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో త్రాగునీటి కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పాడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణ కన్వినర్‌ గోపారం శ్రీనివాసులు అన్నారు. వేసవికాలం సమీపిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు త్రాగునీటి కొరతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వచ్చే ఎండాకాలంలో మున్సిపాలిటీలో త్రాగునీరు అందించడంలో అలసత్వం వహిస్తే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఎన్టీఆర్‌ పేరుతో పథకం పెట్టి 2 లీటర్లకే 20 లీటర్ల నీరు అంటూ ఊదరగొట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరుతో పెట్టిన పథకం చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చారని ఆరోపించారు. పట్టణ ప్రజలకు వేసవికాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Back to Top