మత్స్యకారుల ధర్నాకు మద్దతు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమాన్ని రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిన బాబు...అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా అమలు చేయలేదని తప్పుపట్టారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 13 జిల్లాల వృత్తిదారులు  ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. మోపిదేవి ఇందులో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న తీరప్రాంతంలో ప్రభుత్వం పరిశ్రమల పేరుతో మత్స్యకారుల పొట్టకొడుతోందన్నారు.

Back to Top