ఆటోవాలాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఆదుకుంటారుపూతలపట్టు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోవాలాలను ఆదుకుంటారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. పూతలపట్టు మండలంలో గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పి.కొత్తకోటలోని ఆటోస్టాండ్‌ వద్ద ఆయన ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాగానే ప్ర‌తి ఆటో డ్రైవ‌ర్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇస్తార‌ని వివ‌రించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన హామీ ప‌ట్ల ఆటోడ్రైవ‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తామంతా జగనన్నకు అండగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ఖాకీ చొక్కా తొడిగారు. ఎమ్మెల్యే ఆటోలో డ్రైవర్లను ఎక్కించుకుని కొంతసేపు చక్కర్లు కొట్టడంతో పలువురు ఆసక్తిగా చూశారు.


Back to Top