చిన్నారిని ఆదుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

చిత్తూరు: మతిస్థిమితం లేని ఓ చిన్నారి ఆపరేషన్‌కు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక సాయం అందించారు. రొంపిచెర్ల మండలం దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసింది. తనS కుమారుడు గణేష్‌(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చిందని, దీంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు చేయించామని చెప్పింది. అయితే జ్వరం తీవ్ర ప్రభావం చూపడంతో చిన్నారికి పూర్తిగా మతిస్థిమితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారని, చెన్నైలో ఆపరేషన్‌ చేయించుకోవాలని, అందుకు లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం చేతిలో డబ్బు లేక బిడ్డను కాపాడుకోలేక చిత్రవధ అనుభవిస్తున్నామని గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి తన కుమారుడికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకొన్నారు. స్పందించిన పెద్దిరెడ్డి చిన్నారి ఆపరేషన్‌కు తన వంతు ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. చిన్నారిని స్విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని తల్లిదండ్రలకు సూచించారు. అక్కడ డాక్టర్లతో తాను మాట్లాడి తక్కువ ఖర్చుతో ఆపరేషన్‌ చేసేలా చర్యలు తీసుకోంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
Back to Top