చేతివృత్తుల‌కూ చిల్లుపెట్టిన కాంగ్రెస్: భూమన

తిరుపతి, 19 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేని కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయ్యాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు సహకరించారని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలోని ఆరు కోట్ల మంది ప్రజల‌ జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని కరుణాకర‌రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలోని చేతివృత్తుల వారు కూడా పనులు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియ‌న్ మైనార్టీల దీక్షలో గురువారంనాడు భూమన‌ కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాన‌ మంత్రిని చేయటానికే సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నుతున్నారని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top