హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను వైయస్ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు భూమిరెడ్డి ఓబుల్‌రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అవి బిజెపి, టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే అన్నారు . కార్పోరేట్ల మోజులో ఆ ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కార్మిక పక్షపాతి అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే వైయస్ జగన్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నేతలు బొడ్డు సాయినాథ్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.