మరో ప్రజాప్రస్థానంపై విమర్శలు తగదు


హైదరాబాద్: మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రపై విమర్శలు చేస్తే సహించేది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి తెలుగు దేశం పార్టీని హెచ్చరించారు. ధైర్యమంటే తమ యాత్రను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదని స్పష్టంచేశారు. షర్మిలకు పాదయాత్ర చేసే హక్కుందని పేర్కొన్నారు. ముప్పై ఐదు సంవత్సరాలు వైయస్ఆర్ రాష్ట్రానికి రాజకీయంగా సేవ చేశారన్నారు. షర్మిల వెంట కదిలివస్తున్న జనసముద్రాన్నీ, ఆమెకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నేతలు అదుపు తప్పి మాట్లాడుతున్నారని నిర్మల కుమారి చెప్పారు.

Back to Top