మరో ప్రజా ప్రభంజనమిది: మేకపాటి

అనంతపురం:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం  మరో ప్రజా ప్రభజనంలా సాగుతోందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాత్రలో ఎక్కడికెళ్ళినా షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. ప్రతిచోటా జగన్నినాదాలు మార్మోగుతున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన పుణ్య ఫలాలనీ,  ఆయన పిల్లలకు కలిసి వస్తున్నాయనీ మేకపాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన మీకోసం వస్తున్నా..  పాదయాత్రకూ మరో ప్రజా ప్రస్థానానికీ  పోలికే లేదన్నారు. చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయిన వ్యక్తన్నారు. ఆయనను ఎవరూ నమ్మడం లేదని స్పష్టంచేశారు. వైయస్ కుటుంబీకులపై ప్రజలకు మెండుగా విశ్వాసం ఉందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ విశ్రమించేది లేదని మేకపాటి  స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top