చంద్రబాబు పచ్చి మోసగాడు

విశాఖపట్నం : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, నమ్మక ద్రోహి అని విమర్శించారు. ఎస్సీలను 2 దశాబ్దాలుగా  చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని మందకృష్ణ మాదిగ విశాఖలో ఫైరయ్యారు. 
మాదిగలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మార్చి10వ తేదీ నుంచి మాదిగల మహా విశ్వరూప యాత్ర తలపెట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెల నుంచి ప్రారంభమవుతుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు.

తమ వెనక వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని మందక్రిష్ణ అన్నారు. 
ఎస్సీల వర్గీకరణ అంశంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పేరు వాడుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఉద్యమాలు చేశాం.. అప్పుడు నువ్వు మా వెనకాల ఉన్నావా ? అని సీఎం చంద్రబాబును ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై బాబు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదంటూ నిప్పులు చెరిగారు.
Back to Top