మహానేత హయాంలోనే విద్యార్థులకు మేలు

గుంటూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యార్థులకు సముచిత స్థానం దక్కిందని వైయస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి చెప్పారు. స్థానిక అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా విద్యార్థి విభాగం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేసేందుకు విద్యార్థులు సన్నద్ధంగా ఉన్నారన్నారు. జగగన్న వదిలిన బాణం నీచ రాజకీయాలను అంతమొందించేందుకు దూసుకువస్తోందని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతారన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నగర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో షర్మిల పాదయాత్ర జయప్రదం కావాలని కోరుతూ లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధి విభాగం నగర క న్వీనర్ పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఫీజుపోరు వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన జగనన్నకు విద్యార్థి లోకం అండగా ఉండాలని కోరారు. విభాగం నాయకుడు కారుమూరు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జిల్లాకు వస్తున్న షర్మిలకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top