మహానేత ఏలూరులో పదివేల ఇళ్ళిచ్చారు: నాని

ఏలూరు:

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆదివారం ఏలూరులోని శనివారపేటలో ఆయన పర్యటించారు. డాక్టర్ వైయస్ఆర్ సీఎంగా ఉండగా పేదలకు ఇళ్ళిస్తామని హామీ ఇచ్చారనీ, ఆమేరకు ఏలూరులో పదివేల మందికి ఇల్ళు ఇచ్చారనీ ఆయన చెప్పారు. ఆయన మరణానంతరం ప్రస్తుత ప్రభుత్వం దానిని తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ పథకాలను అన్నింటినీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు తొలగుతాయని ఆయన స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top