<strong>కొత్తూరు (మహబూబ్‌నగర్ జిల్లా),</strong> 11 డిసెంబర్ 2012: మరో ప్రజాప్రస్థానంలో భాగంగా 55వ రోజు పాదయాత్రను మంగళవారంనాడు శ్రీమతి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరుతండా నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ఈ మధ్యాహ్నం కొడిచెర్ల మీదుగా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనంతరం కోళ్లపడకల, దుబ్బచెర్ల, పెండ్యాల క్రాస్ మీదుగా మాన్‌సాన్‌పల్లి చేరుకుంటారు. మాన్‌సాన్‌పల్లి క్రాస్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. తరువాత మాన్‌సాన్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన గుడారంలో శ్రీమతి షర్మిల మంగళవారం రాత్రికి బస చేస్తారు. శ్రీమతి షర్మిల మంగళవారంనాడు మహబూబ్‌నగర్ జిల్లాలో 6.2 కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 10.3 కిలోమీటర్లు మొత్తం 16.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారు.