జనహృదయ విజేత వైయస్‌ జగన్‌

కడుపునిండా కూడు లేని.. 
కంటి నిండా కునుకు లేని పల్లె జనానికి నేనున్నానంటూ..
ఐదేళ్లలో 45 లక్షల ఇళ్లు నిర్మించిన లెజెండ్‌ వైయస్‌ఆర్‌
తూర్పుగోదావరి జిల్లా: ప్రజల మనస్సులు గెలిచిన జనహృదయ నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ సుకుమార్‌ అన్నారు. కడుపు నిండా కూడు లేని.. కంటి నిండా కునుకు లేని పల్లె జనానికి నేనున్నానంటూ ప్రజా సంకల్పయాత్ర ద్వారా కష్టాలు తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కాబోయే ముఖ్యమంత్రి అని సుకుమార్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి స్వార్థపరులు తమ క్షేమం కోసమే జీవిస్తారు.. సామాన్యులు తమ కుటుంబ సంక్షేమానికే జీవితాన్ని ధారపోస్తారు. అదే మహాత్ములు, మహనీయులు లోక కల్యాణానికి తమ జీవితాలను అర్పిస్తారన్నారు. అలాంటి మహనీయుడు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డ వైయస్‌ జగన్‌ అని,  ప్రజా సంకల్పయాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారన్నారు. 
చంద్రబాబుకు, వైయస్‌ఆర్‌ మధ్య వ్యత్యాసం
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రరాష్ట్రానికి అమెరికా ప్రెసిడెంట్‌ వస్తే.. ఆయన పక్కన వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన సత్యం కంప్యూటర్స్‌ అధినేతను కూర్చోబెట్టారు. అదే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అమెరికా ప్రెసిడెంట్‌ వస్తే ఆయన పక్కన డ్వాక్రా సంఘాల మహిళలను, దళిత మహిళలను కూర్చోబెట్టి తెలుగోడి గొప్పతనం చాటిన మహానుభావుడన్నారు. కేవలం ఆయన పరిపాలన చేసిన ఐదేళ్లలో 45 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి జనహృదయ విజేతగా.. సకల గుణాల కలబోతగా నిలిచిన లెజెండ్‌ వైయస్‌ఆర్‌ అని సుకుమార్‌ గుర్తు చేశారు.  
Back to Top