కృష్ణదాసు కుటుంబా‌నికి విజయమ్మ పరామర్శ

హైదరాబాద్,‌ 13 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శనివారం శ్రీకాకుళం జిల్లా వెళ్ళారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈ నెల 4న మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయమ్మ బయలుదేరి వెళ్ళారు.
విజయమ్మ శనివారం ఉదయం 9.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సన్నపేటలోని మబజాల గ్రామానికి వెళ్లి ధర్మాన కుటుంబ సభ్యులను కలుస్తారు. వారిని పరామర్శించిన అనంతరం సాయంత్రం 6.20 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
Back to Top