సమైక్యవాదులంతా వైయస్ఆర్‌ కాంగ్రెస్ వైపే

శ్రీకాకుళం :

సమైక్యాంధ్ర కావాలనుకునే వారంతా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వైపు చూస్తున్నారని పార్టీ శాసనసభా‌ పక్ష ఉపనేత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం మున్సిప‌ల్ హైస్కూల్ మైదానంలో 'సిక్కోలు తిరుగుబాటు' పేరిట‌ ఆదివారం నిర్వహించిన సభలో కృష్ణదాస్ మాట్లాడారు. ఎంపీగా పార్లమెంట్‌లో సమైక్య రాష్ట్రం కోరుతూ ప్లకార్డులు ప్రదరించిన నాటి నుంచి నేటి వరకు మాట మార్చని నాయకుడు శ్రీ వైయస్ జగనే‌ అని అన్నారు.

తెలుగుజాతి ఐక్యతను కాంక్షిస్తున్న నాయకుడు శ్రీ వైయస్ జగ‌న్‌ ఒక్కరే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌చందర్ అన్నారు. అందుకే ఆయనను చూస్తే కాంగ్రెస్, టీడీపీలకు దడ అన్నారు. ప్రజలంతా నా కోసం కాకుండా, రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం పోరాడాలంటూ కరుణామయుడు తరహాలో అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.

సమైక్యం కోరుకునే వారంతా ఐక్యం కావాలని శ్రీకాకుళం జెడ్పీ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం ‌పిలుపు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కొన్ని మీడియాలు వైయస్ఆర్‌సీపీ బలం తగ్గుతోందని ప్రచారం చేయడంలో వాస్తవం లేదనడానికి ఇటువంటి సభలే నిదర్శనమని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. ప్రజల కోసమే పనిచేసే‌ది వైయస్ఆర్ కుటుంబమని కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ కృష్ణారావు చెప్పారు. మాటకు కట్టుబడే వంశం వైయస్ఆర్‌ది అని, ఆ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ జగన్ అదేబాటలో నడుస్తున్నారని‌ పార్టీ మున్సిపల్ పరిశీలకుడు కొయ్య ప్రసా‌ద్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదని ఉపేక్షించబడిన జిల్లా అని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు అన్నారు. జిల్లాను వైయస్ఆర్ ‌గణనీయంగా అభివృద్ధి చేశారన్నారు.

ఈ సమావేశంలో పార్టీ  పార్లమెంటరీ నియోజ కవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, పీఎంజె బాబు, కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్యే పి.రాజన్నదొర, కలమట మోహనరావు, మినతి గొమాంగో, నియోజకవర్గ సమన్వ యకర్తలు తమ్మినేని సీతారాం, వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top