'జగన్‌ సిఎం అయ్యే దాకా సైనికుల్లా పనిచేయండి'

వరంగల్, 13 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని సిఎం చేసేంతవరకు ప్రతి కార్యకర్తా సైనికునిలా పనిచేయాలని పార్టీ నాయకుడు కొండా మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు చీదరించుకుంటే, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రజలు హృదయపూర్వకంగా ఆదరిస్తున్నారని ఆయన గురువారంనాడు వరంగల్‌లో చెప్పారు. కాంగ్రెస్‌, టిడిపిలు చేస్తున్నంత నీతిమాలిన రాజకీయాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని మురళీధర్‌రావు విచారం వ్యక్తంచేశారు. ఈ దుష్టశక్తులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Back to Top