'వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేత'

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నేత అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాటిస్తే కట్టుబడతారని, తనకు ఎమ్మెల్సీ ఖరారు చేసి మరోసారి నిరూపించుకున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకం, రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో తాను ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. నైతిక విలువలకు కట్టుబడి తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. తనపై ఉన్న నమ్మకంతో వైఎస్ జగన్ తనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారన్నారు.  పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని మరింత ముందుకు నడిపించానన్నారు. పనితీరు, నిజాయితీని గుర్తించి తన కు ఎమ్మెల్సీ ఖరారు చేశారని చెప్పారు.
 
ఎన్నికలకు ముందుకు కొందరు నేతలు బయటికొచ్చి వైఎస్ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేశారని, కానీ అదంతా అసత్య ప్రచారమని, ఆయన మాటకు కట్టుబడే నేత అని చెప్పడానికి తాజాగా తనకు న్యాయం చేసిన విధానాన్నే తీసుకోవచ్చన్నారు.  ఎన్ని ఒత్తిడులు ఉ న్నా అందర్నీ ఒప్పించి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఎమ్మెల్సీ ఖరారు చేసిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందరి సమన్వయంతో విజయవంతం చేయడమే కాకుండా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.  
Back to Top