రూల్స్ తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిది

హైదరాబాద్ః ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ సర్కార్ పై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. చర్చను పక్కదారి పట్టించేందుకు యనమల రూల్స్ ను బ్రేక్ చేయబోయారు. దీనిపై ప్రతిపక్ష నేత స్పందిస్తూ రూల్స్ గురించి తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిదని యనమలకు చురక అంటించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వంపై తాము అవిశ్వాసం పెడితే...అసలు చర్చను వదిలేసి మంత్రులు ఏవేవో మాడట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతివిషయంలోనూ భయపడుతోందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎవరు ప్రారంభించాలన్న విషయంపై ఏపీ అసెంబ్లీలో వివాదం చెలరేగింది. తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు సంతకం పెట్టలేదు కాబట్టి, చర్చను ఆయన ప్రారంభించే అవకాశం లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను  ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ''అవిశ్వాస తీర్మానాన్ని ఒకే ఒక్క సభ్యుడైనా సంతకం పెట్టి ఇవ్వచ్చు. తగినంత మంది సభ్యులు లేచి నిలబడిన తర్వాత మోషన్ పాస్ అవుతుంది. ఆ తర్వాతే చర్చ మొదలవుతుంది. ఒక్కరే సంతకం పెట్టారు కాబట్టి ఆ ఒక్కరే చర్చ సాగించాలంటే కుదరదు. రూల్స్ తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైఎస్ జగన్ యనమలకు హితవు పలికారు. 

వాజ్‌పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు అవిశ్వాసం మూవ్ చేశారు. అక్కడేమైనా సోనియాగాంధీ సంతకం పెట్టారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఎవరో ఒకరిద్దరు సంతకాలు పెడతారు. తీర్మానం మూవ్ చేసిన రోజు సంఖ్యాబలం ఉందా లేదా అని చూస్తారు. తర్వాత 10 రోజుల్లోగా ఆమోదయోగ్యమైన రోజును నిర్ణయిస్తారు. కానీ, టీడీపీ  ఇక్కడ కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.  మోషన్ మూవ్ చేసిన ఐదారు గంటలకే,  అది ఈరోజే ఎందుకు చర్చ మొదలుపెట్టారు..? 8 మంది మా సభ్యులను మీరు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. వాళ్లు కనీసం సభలో కూడా కనిపించడం లేదు. వాళ్లను అనర్హులను చేయడానికి మనసు కూడా లేదు'' అంటూ వైఎస్ జగన్ అధికారపక్షాన్ని కడిగిపారేశారు. 

అంతకుముందు పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్‌ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన నేపథ్యంలో చర్చకు అనుమతించినందుకు ధన్యావాదాలు తెలుపుకొంటున్నామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాహితాన్ని, ప్రజాభివృద్ధిని గాలికి వదిలి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇది ప్రజావిశ్వాసాన్ని , సభ్యుల విశ్వాసాన్ని కూడా కోల్పోయిందని సభలో చెప్పడం కోసమే ఈ తీర్మానాన్ని తాము ప్రవేశపెట్టామన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సిందిగా అందరినీ కోరుతున్నట్లు చెప్పారు. ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు మాట్లాడిన తర్వాత ఇద్దరు అధికార పక్ష సభ్యులు మాట్లాడాల్సి ఉందని, అందువల్ల స్పీకర్ ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు. 

Back to Top