కర్నూలు ఎస్‌ఇ కార్యాలయం వద్ద విజయమ్మ ధర్నా

హైదరాబాద్, 9 జనవరి 2013: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బుధవారం ‌రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ స్వయంగా పాల్గొంటున్నారు. కర్నూలు పట్టణం బళ్లారి చౌరస్తాలోని ట్రాన్సుకో సూపరింటెండింగ్ ఇంజనీ‌ర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి‌ శ్రీమతి విజయమ్మ బయలుదేరి 10.30 గంటలకు కర్నూలులో జరిగే ధర్నాలో పాల్గొంటారని వారు వివరించారు.
Back to Top