కేంద్రంలో కీలకంగా మారతాం: మేకపాటి

అనంతపురం:

ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీల తర్వాతి స్థానంలో నిలుస్తుందని నెల్లూరు  ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అనంతపురం సప్తగిరి క్రాస్ వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో అయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. మహానేత వైయస్ కారణజన్ముడని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రుద్దే నేతలు మనల్ని పాలించడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జగన్ బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనీ, ఢిల్లీలో కూడా కాంగ్రెస్, బీజేపీల తరువాత 35 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీ వైయస్ఆర్‌ సీపీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సప్తగిరి సర్కిల్‌లో జరిగిన సభలో తెలుగుదేశం అనుబంధ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సమీప బంధువు తరిమెల శరత్‌చంద్రారెడ్డి షర్మిల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.

తాజా వీడియోలు

Back to Top