కాంగ్రెస్, టీడీపీల 'సహకారం'

హైదరాబాద్:

సహకార ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో పరాజయం తప్పదని స్పష్టంకావడంతో అధికార కాంగ్రెస్, టీడీపీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. పరాభవాన్ని తప్పించుకోవడానికి అనైతిక పద్ధతులకు ఒడిగడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియనే రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వివిధ అంశాలలో కుమ్మక్కయిన ఈ రెండు పార్టీలూ సహకార ఎన్నికలలో పోటీకి దిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను భీతావహుల్ని చేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఇందుకు అధికారగణాన్ని వారు వినియోగించుకుంటున్నారు. చాలా సంఘాలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను నిలుపుతున్నాయి.
మరికొన్ని సొసైటీలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన వారిని ఓటర్ల జాబితానుంచి తొలగింపజేస్తున్నారు. అధికారుల సాయంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి నామినేషన్లను తిరస్కరింపజేస్తున్నారు. ఇది ఓ రకంగా సహకార వ్యవస్థపై దాడిచేయడం లాంటిదే.

     మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు విజయకుమార్ ఒత్తిడితో నెల్లూరులో అధికారులు తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించడం ఇందుకు తార్కాణం.  గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ సొసైటీలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషనను అధికారుల తిరస్కరించారు. దీనిని పార్టీ ప్రశ్నించడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులతో చిన్నపాటి వాగ్వివాదం కూడా చోటుచేసుకుంది.   
చిత్తూరు జిల్లాలో తిరుపతి రూరల్ మండలం బైరాగిపట్టెడ సొసైటీలో     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 300 పేర్లు  గల్లంతయ్యాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పదకొండు సొసైటీలలో ఎన్నికలను వాయిదా వేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలుపొందుతారనే భీతితోనే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందనేది సుస్పష్టమని శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సొసైటీలో కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు భుజంభుజం కలిపి నడుస్తున్నాయి.

     తూర్పు గోదావరి, వైయస్ఆర్ కడప, ఖమ్మం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తదితర జిల్లాల్లో టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి మాత్రమే సొసైటీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓ డించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

Back to Top