కాంగ్రెస్-టీడీపీల కుమ్మక్కు కలచి వేసింది

హైదరాబాద్, 27 నవంబర్ 2012:

అధికార కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు కావడం తన మనసును కలచి వేసిందని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు. టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

      చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్టాడారు. ప్రజా సంక్షేమ పథకాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే అమలు అవుతాయని ఆశిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యానన్నారు. 2, 3 రోజుల్లో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం లోటస్‌పాండ్‌కు వెళ్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు.

Back to Top