కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం

రాజుపాలెం:

ప్రజల కష్టాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. మండలంలోని పెదనెమలిపురిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గడప గడపకు వైయస్ఆర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రజలే బుద్ది చెబుతారని చెప్పారు. అంబటి మాట్లాడుతూ ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త  సైనికుడిలా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, రాజుపాలెం, ముప్పాళ్ల, నకరికల్లు మండలాల పార్టీ కన్వీనర్లు తోట ప్రభాకర్‌రావు, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, మేడికొండ ప్రకాష్‌రెడ్డి, సత్తెనపల్లి పట్టణ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top