జోగిందర్‌సింగ్‌ చెప్పింది నిజమైంది: షర్మిల

తెనాలి, 21 మార్చి 2013 : 'కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మ' అనే విషయం ఈ రోజు మరోసారి స్పష్టమైందని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం తెనాలిలో మాట్లాడుతూ, సిబిఐ మాజీ డైరక్టర్ జోగింద‌ర్ సింగ్‌ ఇంతకు ముందే ఈ వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. యు.పి.ఎ.కు మద్దతు విరమించిన మరుసటి రోజునే డిఎంకే నాయకుడు‌ ఎం.కె. స్టాలిన్ ఇంటిలో సిబిఐ సోదాలు చేయటం... నిరసనలు వెల్లువెత్తటంతో కేంద్రం ఒక కనుసైగ చేయటంతోనే సోదాలు ఆపేసిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. శ్రీమతి షర్మిల గురువారంనాటి పాదయాత్రలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ ‌భారతిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఆమె విన్నారు.
Back to Top