వైయస్‌ జగన్‌పై విమర్శలు సిగ్గుచేటు


విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ, సీపీఐ, బీజేపీ నేతల విమర్శలు సిగ్గు చేటు అని పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ ఖండించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. హోదా ఇచ్చే వారికి సహకరిస్తామన్నవైయస్‌   జగన్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి రామకృష్ణ దిగజారి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీరుడిలా పోరాటం చేస్తున్నారని చెప్పారు. నిన్న సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆయన చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా మాట్లాడాలని, పచ్చ చొక్క వేసుకున్న నాయకుడిలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇందుకోసం మేం మొదటి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశామన్నారు. వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కావాలని భావించే వారంతా వైయస్‌ జగన్‌ వెంట నడవాలని, వద్దు అనుకున్న వారు చంద్రబాబుతో నడవాలని ఆయన సూచించారు. వీరుడు, ధీరుడు, ధీశాలి వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని ఆయన కోరారు. యువభేరి, ప్లీనరీ, ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కూడా ఇదే మాట చెప్పామన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు అచ్చొచ్చిన ఆంబోతులా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఆయనకు సిగ్గు, శరం, చీము , నెత్తూరు ఉంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు.  చంద్రబాబు, లోకేష్‌ మెప్పుకోసం అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాకు, మీకు మధ్య ఓట్ల తేడా 1.5 శాతమే అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనా అందరూ కలిస్తే వచ్చిన ఓట్లు 46 శాతం మాత్రమే అన్నారు. అచ్చెన్నాయుడు సంస్కారహీనుడని, ఆయన వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.

కామినేని శ్రీనివాస్‌ కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.  అసలు నీవు ఏ పార్టీకి చెందిన వ్యక్తివని, అటు ఇటు కానీ పార్టీకి చెందిన వాడివా సమాధానం చెప్పాలన్నారు. నీవు చంద్రబాబు తొత్తువని, నీకు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆదినారాయణరెడ్డికి వైయస్‌ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని, పార్టీ ఫిరాయించిన వ్యక్తి విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.
 
Back to Top