గుత్తి: అనంతపురం ఎంపీ దివాకర్‌రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్‌లా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జేసీ విమర్శించడాన్ని వారు ఖండించారు. బీసీ సెల్‌జిల్లా నాయకులు రంగస్వామి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ సెల్‌రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌చెవుల మల్లయ్యయాదవ్, పట్టణ, మండల కన్వీనర్లు హుసేన్‌పీరా, గోవర్దన్‌రెడ్డి, మైనార్టీ సెల్‌జిల్లా కార్యదర్శి, మున్సిపల్‌కౌన్సిలర్‌నజీర్, జిల్లా బీసీ సెల్‌నాయకులు రంగస్వామి, ప్రసాద్‌గౌడ్‌మాట్లాడారు. జిల్లాలో కరువు బారిన పడిన రైతులు ఉపాధిలేక వలస వెళ్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎంపీ దివాకర్‌రెడ్డి ఏమాత్రం స్పందించడ లేదన్నారు. కేవలం చంద్రబాబు మెచ్చుకోలు కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం ఆయన దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్‌విసిరారు. వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్‌చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. తమ నాయకుడు జగన్‌పై మరోసారి నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.