ప్రజల అభివృద్ధిని జేసీ సోదరులు పట్టించుకోవడం లేదు

అనంతపురం: ప్రజల అభివృద్ధిని జేసీ సోదరులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి విమర్శించారు. పోలీసు పికేటింగ్‌ సాక్షిగా విజయభాస్కర్‌రెడ్డిని జేసీ వర్గీయులు హత్యా చేశారన్నారు. జేసీ సోదరులు పోలీసుల సాక్షిగా దాడులు చేస్తున్నారు. ఇల్లు పీకుతున్నా తహశీల్దార్‌ చోద్యం చూస్తున్నారు. జేసీ సోదరులు ఎంతటి నీచానికైనా పాల్పడుతారని విమర్శించారు. కిష్టిపాడులో వర్గ కక్షలు పెట్టారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం  తాడిపత్రి పెద్ద వడుగూరు లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  మా అభివృద్ధి చూసి తాడిపత్రి ప్రజలు ఓట్లు వేస్తున్నారని జేసీ సోదరులు పేర్కొంటున్నారని, ఇది పచ్చి అబద్ధమన్నారు. వారి భయానికి ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు.
తాడిపత్రిలోని గ్రానైట్  ఫ్యాక్టరీల నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఎవరూ స్వేచ్ఛగా బతుక కూడదన్నదే జేసీ సోదరుల లక్ష్యమన్నారు. ఈ విషయాలపై వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యాడికిలో ఒక్క ప్రభుత్వ జూనియర్‌కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు. మన పిల్లలు వ్యవసాయం చేసుకోవాలే తప్ప..మనం బాగుపడటం వారికి ఇష్టం లేదన్నారు.నియోజకవర్గం పట్ల వారికి దయాదక్షిణ్యాలు లేవన్నారు. ఎస్సీలు చర్చీకి వెళ్తున్నారని వారికి బీసీసీ సర్టిపికెట్‌ ఇస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి మంచినీరు, సాగునీరు తీసుకువస్తామని చెప్పారు. 30 సంవత్సరాలు మనం జేసీ సోదరులకు ఊడిగం చేశాం. ఇక వారి పాలనకు చరమగీతం పాడుదాం, నాకు ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ను వదిలేది లేదని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెద్దవడుగూరులో ఇంత పెద్ద ఎత్తున జనం హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. జేసీ సోదరులకు మనుషులను చంపడం అంటే అంత తేలికగా ఉంటుందా అని ప్రశ్నించారు. నియోజకవర్గం ఏమైనా జేసీ సోదరుల సొత్తా అని ఫైర్‌అయ్యారు. జేసీ సోదరుల వంటి లీడర్లు రాజకీయాల్లో ఉండటం మనకే నష్టమన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి చేతకాని దద్దమ్మ అని విమర్శించారు. వారికి ప్రజాస్వామ్య విలువలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల జేసీ సోదరుల పాలనలో ఏ ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. తాడిపత్రితో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేసి, వైయస్‌ విజయమ్మకు ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తామన్నారు.
Back to Top