జనం కష్టాలు తీర్చగల జననేత వైయస్‌ జగనే

హైదరాబాద్, ‌5 అక్టోబర్‌ 2012: మన రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చగల దమ్ము, ధైర్యం, శక్తీ ఉన్న ఏకైక నాయకుడు జననేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అని శ్రీదేవి మాస్టర్‌ మీడియా అధినేత ఐ. రామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి చెందిన రామకృష్ణంరాజు గురువారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్‌ సిపిలో చేరారు.
లోటస్‌పాండ్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయనకు విజయమ్మ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గనేత వాడుక రాజగోపా‌ల్ ఆధ్వర్యంలో రామకృష్ణంరాజు చేరారు.

ఈ సందర్భంగా రాజగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ, వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన బాటలోనే వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తిరిగి వైయస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖులందరూ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top