జగన్‌తోనే సుపరిపాలన

ఇచ్ఛాపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సుపరిపాలన సాధ్యమని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి.కృష్ణారావు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని బెల్లుపడ ప్రాంతంలో గడప గడపకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. పార్టీ కరపత్రాలను ఇంటింటికీ పంచి మద్దతు నివ్వాలని కోరారు. తమకు మేలు చేసిన మహానేత వైయస్‌ను మరిచిపోయేది లేదని, జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తమ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా వృద్ధులు అన్నారు. కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో, అందని ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రజల బతుకు దుర్భరంగా మారిందన్నారు. ప్రజల బాగోగులు చూసే నాయకుడు జగన్ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ కన్వీనర్ పిలక పోలారావు రెడ్డి, పట్టణ యువజన అధ్యక్షుడు పరపటి కోటి, పార్టీ మండల యువజన అధ్యక్షుడు పిట్ట ఆనంద్,మేరుగు వెంకట రెడ్డి, సాలిన ఢిల్లీ, దుర్గాశి లింగరాజు, నందికి లింగరాజు, ఉలాసి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top