జగన్‌తోనే రాష్ర్ట అభివృద్ధి సాధ్యం: భూమన

రేణిగుంట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. రేణిగుంట మండలం సుబ్బయ్యగుంట గ్రామంలో ఆదివారం భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ యూత్‌నాయకుడు వెంకటరెడ్డి, మస్తాన్, వెంకటమునిరెడ్డి, గోవిందరెడ్డి, బత్తిరెడ్డి, గురవారెడ్డి, వెంకట్రామయ్య, రాజేశ్వరమ్మ, మునెమ్మ, బత్తెమ్మలతో పాటు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి హయాం లో అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందార న్నారు.

పన్నులు, కరెంట్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలిం చిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొ న్నారు. ఆయన మరణానంతరం బస్‌చార్జీలు, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు లెక్కలేకుండా పెరిగిపోయాయని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయన్నారు. సోనియాగాంధీని వ్యతిరేకించారన్న ఒక్క కారణంతో జగన్‌మోహన్‌రెడ్డిని అవినీతిపరునిగా చిత్రీకరించి జైలు పాలు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సుబ్బయ్యగుంటలో రెండు వందల మంది ఆ పార్టీ కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. ప్రజల మేలుకోరే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

కరుణన్న లాగే నన్నూ ఆదరించండి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తరహాలోనే రేణిగుంట మండలంలో తనను ఆదరించి ఆశీర్వదించాలని వైయస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి కోరారు. రేణిగుంట మండలం సుబ్బయ్యగుంటలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కరుణాకరరెడ్డికి ఘనస్వాగతం
రేణిగుంట మండలం సుబ్బయ్యగుంట లో భూమన కరుణాకరరెడ్డి, వైయస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రేణిగుంట జెడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమలరెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికా రు. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. బాణసంచా పేలుళ్లు, డప్పుల మధ్య ఊరేగించారు. ఆ పార్టీ శ్రీకాళహస్తి టౌన్ కన్వీనర్ కంఠా రమేష్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి బాలకృష్ణయ్య, మల్లం రవిచంద్రారెడ్డి, రేణిగుంట మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, ఏర్పేడు మండల కన్వీనర్ కోటేశ్వరరావు, నాయకులు పల్లం లక్ష్మీనారాయణ, హరియాదవ్, రామ్మోహన్, రమణరాయల్, ఎంజీ రాజేష్, గణేష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆరిశెట్టి దేవానంద్, నగరం భాస్కర్‌బాబు, శ్రీకాంత్ రాయల్ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top