జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు

గంగాధర నెల్లూరు:

ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డిని అకారణంగా జైలుపాలు చేశారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆరోపించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టంచేశారు. గంగాధర నెల్లూరు వైయస్ఆర్ సీపీ కార్యకర్త జగన్‌బాబు ఆధ్వర్యంలో వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు. 500మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ  మహానేత  కుటుంబానికి కులమతాలు లేవని, వారికున్నది కేవలం ప్రజాహితం మాత్రమేనని అన్నారు. కులాలు, పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు.

Back to Top