జగన్‌పై కేసు పాలకుల కుట్రే: రోజా

పుత్తూరు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై పెట్టిన కేసు ప్రభుత్వం చేసిన కుట్రని  పార్టీ నాయకురాలు ఆర్‌కే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని విజయపురంలో మంగళవారం జగన్ కోసం జన సంతక కార్యక్రమం నిర్వహించారు. తొలుత బ్యానర్‌పై రోజా సంతకం చేశారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కారు మబ్బులు చీల్చుకు వచ్చిన సూర్యునిలా శ్రీ జగన్మోహన్‌ రెడ్డి బయటకొచ్చి పేదల కష్టాలు తీరుస్తారన్నారు. ఆయనకు ప్రజల అభిమానం ఎప్పుడూ ఉంటుందనీ,  2014లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయనీ పేర్కొన్నాన్నారు.

Back to Top