జగన్‌పై కాంగ్రెస్, టీడీపీల కుట్ర: జయ్‌రాజ్

తల్లాడ:

అధికార కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైయస్ జగన్‌పై కుట్ర చేస్తున్నాయని వైయస్‌ఆర్ సీపీ దళిత విభాగం జిల్లా కన్వీనర్ మెండెం జయరాజ్ అన్నారు. తల్లాడలో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పె ట్టించారని అన్నారు. త్వరలోనే జగన్ నిర్ధోషి బయటకు వస్తారని అన్నారు. విజయమ్మ నాయకత్వంలో వైయస్‌ఆర్ సీపీ ప్రజాదరణతో మరింత ముందుకు పోతోందని అ న్నారు. తప్పుడు కేసులతో జగన్‌ను చెరసాల పాలు చేయగలరేమోకానీ ప్రజల హృదయాల్లోంచి మా త్రం దూరం చేయలేరని ఆయన అన్నారు.

పార్టీలో చేరిక
కల్లూరు:
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్‌లోకి కర్నూలుకు చెందిన ప్రైవేటు ఫొటో, వీడియోగ్రాఫర్లు చేరారు. ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వారు మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎస్వీ కాంప్లెక్సులో ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటో, వీడియో గ్రాఫర్ల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వారికి ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమాజానికి ఫొటో, వీడియోగ్రాఫర్ల సేవలు ఉపయోగకరమని అన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు బి.రాఘవేంద్రనాయుడు, నేతలు జి.భాస్కర్, దస్తగిరి, జయపాల్, శేఖర్, పాపన్న, బాష పాల్గొన్నారు.

Back to Top