జగన్ నాయకత్వాన్ని బలపరచాలి: కవిత

అనంతపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైయస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత, పార్టీ జిల్లా ముఖ్యనేత ఎర్రిస్వామి రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ నగర్‌లో పార్టీ నాయకులు గోవింద రెడ్డి, అంకిరెడ్డి ప్రమీల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై ప్రజలు విసుగెత్తిపోయి వైయస్ఆర్ సీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వారంతా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అలాంటి వారందరికీ పార్టీ సభ్యత్వం అందజేయాలని నాయకులకు సూచించారు. 

జగన్ విడుదల కావాలని పూజలు
కుప్పం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ఆ పార్టీ నాయకలు మంగళవారం స్థానిక తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్బు, కన్నన్, ఏడిఎస్ శరవణ, సెల్వం, సతీష్, జంషడ్ బాషా, నళిని, నాయకులు సలామత్, మంజు, హరి, కిరణ్, వేలు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు.

మైసూరాను విమర్శించే అర్హత పుత్తాకు లేదు: వైయస్ఆర్ సీపీ
కడప: టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు మైసూరారెడ్డి అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కిశోర్‌కుమార్, నేతలు చంద్రమోహన్‌రెడ్డి, రఫీ తెలిపారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గురవింద సామెత మాదిరిగా పుత్తా మైసూరాపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మహానేత వైయస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సంతృప్తి చెందక పార్టీ మారిందెవరో అందరికీ తెలుసన్నారు. ఎవరు టిక్కెట్‌ఇస్తే ఆ పార్టీలోకి పోయే అలవాటు పుత్తాకే ఉందని మండిపడ్డారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా కమలాపురం నియోజకవర్గానికి మైసూరారెడ్డి ఎంతో సేవ చేశారని, అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. పాదయాత్రకు నాంది పలికింది మైసూరా అయితే తనతో కలిసి పాదయాత్ర చేయాలని పుత్తా మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. పాదయాత్రకు రాష్ట్ర స్థాయి నేతలను పిలిపించినా ప్రభుత్వంపై ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు.
Back to Top