'జగన్‌కు బెయిలు పొందే హక్కు ఉంది'

న్యూఢిల్లీ: ఒక్కసారి ఛార్జిషీటు దాఖలయ్యాక నిందితుడికి బెయిలు పొందే హక్కు ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం చెప్పారు. ఈకేసును చట్ట పరిధిలోనే చూడాలని ఆయన అన్నారు. చట్టపరిధి దాటి చూడవద్దన్నారు. బెయిలు కోసం వస్తే జైల్లో ఉండమంటున్నారని, ఏ చట్టం దీన్ని చెప్తోందని ఆయన ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ వేస్తే, మార్చి 31 వరకూ జైల్లోనే ఉండమని ఎలా చెప్తారు? అని ఆయన ప్రశ్నించారు.

జగన్ బెయిల్కు అడ్డుపడిన సీబీఐ
హైదరాబాద్ : వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్‌ను అడ్డుకోడానికి సిబిఐ అనుసరించిన వ్యూహం చర్చనీయాంశమవుతోంది. దాదాపు ఏడాది కింద కేసును నమోదు చేసిన సిబిఐ ..... విచారణకు మరింత గడువు కావాలని శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది. జగన్‌ను అరెస్టు చేసి ఇప్పటికి 132 రోజులవుతోంది. ఇప్పటికే సీబీఐ నాలుగు చార్జ్‌షీటులు నమోదు చేసింది. సమగ్ర పరిశోధన పూర్తి చేసిన సిబిఐ ఈ కేసుకు సంబంధించి విదేశాల్లోనూ విచారణ జరపాలని కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు చేసిన విచారణలో ఒక్క రోజు కూడా వృధా చేయలేదని తెలిపింది. సిబిఐ విజ్ఞప్తిని మన్నించిన కోర్టు మార్చి 31లోగా విచారణను పూర్తి చేయాలని సూచించింది. ఒక్క చార్జిషీట్‌లోనే మొత్తం కేసునంతా సమర్పించాలని తెలిపింది.

Back to Top