'జగన్‌కు బేషరతుగా బెయిల్ ఇవ్వాలి‌'

సూర్యాపేట: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి నిర్దోషి అని, ఆయనకు బేషరతుగా బెయిల్ ఇవ్వాలని ‌పార్టీ సీఈసీ సభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.‌ శ్రీ జగన్ విడుదల కోసం ఆదివారం సూర్యాపేట, నేరేడుచర్లలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ‌ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కై శ్రీ జగన్‌ను జైలులో పెట్టించాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐతో కుమ్మక్కై కేసులు నమోదు చేయించిందన్నారు.
Back to Top