లోక కల్యాణానికి ఆనాడు రాముడు.. ఈ నాడు వైయస్‌ జగన్‌

విజయనగరం: శ్రీరాముడు లోక కల్యాణం కోసం ఏ విధంగా అడవుల్లో తిరిగారో.. ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ జగన్‌ కూడా ప్రతీ గ్రామం తిరుగుతున్నారని వృద్ధురాలు విజయలక్ష్మి అన్నారు. దత్తిరాజుగిరి మండలం, చౌదంతివలస నాయుడి వీధి గుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైయస్‌ జగన్‌కు హారతి ఇచ్చి ఆశీర్వదించాలని సీతాలక్ష్మి అనుకుంది. కానీ కదలలేని స్థితి. కీళ్ల నొప్పులతో నడవలేని దయనీయస్థితి. వైయస్‌ జగన్ను కలవాలనే సంకల్పం మాత్రం ఆమెలో బలంగా ఉంది. చౌదంతివలస నాయుడి వీధి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌ సీతాలక్ష్మిని చూసి ఆమె ఇంటి ముందుకు వెళ్లారు. తన కోసం వైయస్‌ జగన్‌ను చూసి ఆమె పులకించిపోయి నుదుట తిలకం దిద్ది హారతి పట్టి ఆశీర్వదించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటే చాలా అభిమానం.. ఆయన పాలన చూశాం.. ఇప్పుడీ చంద్రబాబు పాలనలో తిండి దొరకని పరిస్థితులు.. రాముడు అరణ్యవాసం చేసినట్లుగా వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌ జనం కోసం పాదయాత్ర చేస్తున్నాడు. కచ్చితంగా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడు.. ఆయన సీఎం అయితేనే మా బిడ్డల బతుకులు బాగుపడతాయని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top