పంట పొలాల్ని ఎండ బెడ‌తారా..!

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిత్రావ‌తి రిజ‌ర్వాయ‌ర్ ను సంద‌ర్శించారు. నీటి లభ్య‌త‌, నీటి విడుద‌ల వంటి వివ‌రాల్ని అక్క‌డి అధికారుల్ని అడిగి తెలుసుకొన్నారు. కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు.ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌రిశీలించారు. ‘ప్రస్తుత పరిస్థితులలో.. వేసవి నేపథ్యంలో నెలకు మూడు తడులు అవసరం.. కానీ ఏడాదికంతా కలిపి 12 వేల ఎకరాలకు కేవలం ఒక్క తడి నీరు అందించిన చరిత్ర ఇక్కడే చూస్తున్నాం.. 1.25 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టు, పులివెందుల నియోజకవర్గం, మున్సిపాలిటీకి కేవలం .063 టీఎంసీల నీరు ఏ మూలకు సరిపోతుంది? ఈ కాస్త నీరు అటు సాగు, ఇటు తాగడానికి సరిపోవడం లేదు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే టీడీపీ ప్రభుత్వంలో భారీగా వచ్చిన నీటితో సాగు, తాగునీరు సమస్య తీరిపోయిందని సన్మానాలు చేయించుకోవడం చంద్రబాబుకే చెల్లింద’ని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 
Back to Top