హైదరాబాద్, 2 అక్టోబర్ 2012: జాతిపిత, పూజ్య బాపూజీ గాంధీ జయంతి వేడుకలను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పలువురు ముఖ్యనేతలు హాజరై గాంధీ మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించారు. <br/>ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.<br/>ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, దేశ ప్రజలు గాంధీ మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజలు అనుసరించినట్లయితే మన దేశం అన్ని రంగాల్లోనూ బాగుపడుతుందన్నారు. గాంధీ సిద్ధాంతాలను విదేశాల్లో కూడా అనుసరిస్తున్నారని తెలిపారు. ప్రపంచదేశాలన్నీ గాంధీ మార్గంలో పయనించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందని అన్నారు. గాంధీ వారసులమని చెప్పుకునే కొంతమంది నేతలు ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు రకరకాల అవస్థలు పడుతున్నారని, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాక ఎన్ని యాత్రలు చేసినా ఆయనను ఎవరూ నమ్మబోరని మేకపాటి వ్యాఖ్యానించారు. <br/>